తెలుగు సినిమా పరిశ్రమలో అందరూ కలిసి ఉన్నట్టే కనిపించినా.. ఎవరి బ్యాచ్ వారు మైంటైన్ చేస్తారు. ఎవరి ఈగో వాళ్లకు ఉంటుంది. ఆ విషయంలో చాలామంది లోలోపల ఉన్న ఒపీనియన్ ని ఓపెన్ అవ్వరు. తాజాగా ఎవరి కుంపటి వారిదే అంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా చర్చలకు దారి తీశాయి.
ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా మాట్లాడే అల్లు అరవింద్ తాజాగా సైమా ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ.. తెలుగు వారికి ఏడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. వారిని ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించింది అని అన్నారు.
అంతేకాకుండా ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అల్లు అరవింద్ కామెంట్స్ తో మరోసారి సినిమా ఇండస్ట్రీలో కలిసికట్టుగా లేకపోవడంపై మళ్లీ చర్చ మొదలైంది.