Advertisementt



జగన్ రెడ్డి అడ్డాలో టీడీపీ ప్రభంజనం

Thu 14th Aug 2025 12:07 PM
tdp  జగన్ రెడ్డి అడ్డాలో టీడీపీ ప్రభంజనం
TDP victory in Jagan Reddy Adda జగన్ రెడ్డి అడ్డాలో టీడీపీ ప్రభంజనం
Advertisement
Ads by CJ

40 ఏళ్లకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించి, వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. జగన్ రెడ్డి అడ్డాలో టీడీపీ విజయాన్ని అది కూడా కనీ విని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. 

జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో జరిగిన ZPTC ఉపఎన్నికలో YSRCP పార్టీ డిపాజిట్ కోల్పోయింది. పులివెందుల ఉప ఎన్నికలో మొత్తం 8,103 ఓట్లు పోలయ్యాయి. అందులో కూటమి అభ్యర్థి B.Tech రవి సతీమణి శ్రీమతి మారెడ్డి లతా రెడ్డి కి 6735 ఓట్లు వచ్చాయి. 

YSRCP అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 685 ఓట్లు తో డిపాజిట్ కోల్పోయారు.. 6050 ఓట్ల మెజారిటీ తో కూటమి అభ్యర్థి లతా రెడ్డి ఘనవిజయం సాధించారు. జగన్ ఎదురు లేదు అని కలలు కన్నా సొంత గడ్డపై విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ముఖ్యంగా టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. 

TDP victory in Jagan Reddy Adda:

TDP Wins Pulivendula ZPTC By-Election

Tags:   TDP
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ