కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని రేణు స్వామి హత్యకేసులో కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్ పై బయట తిరుగుతున్నారు. కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దర్శన్ కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హత్య కేసులో కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
హై కోర్టు మంజూరు చేసిన బెయిల్, రద్దు అంశాలను మేం పరిశీలించాం. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు నిర్ణయం పూర్తిగా యాంత్రికంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. బెయిల్ పై బయట ఉన్న వ్యక్తి విచారణపై ప్రభావం చూపించడమే కాదు, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే దర్శన్ బెయిల్ రద్దు చేస్తున్నట్టుగా జస్టిస్ మహదేవన్ తీర్పునిచ్చారు.
ఇది అనిర్వచనీయం. జస్టిస్ మహదేవన్ చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చారు. నిందితుడు ఎంత పెద్దవాడైనా చట్టానికి అతీతుడు కాదని నిరూపించారు అంటూ జస్టిస్ పర్దివాలా.. మహదేవన్ తీర్పును ప్రసంశించారు.