యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా నలిగిపోతున్నారు. కారణం వార్ 2 రిలీజ్ రోజునే సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి విడుదలవుతూ ఉండడం. రెండు పెద్ద సినిమాల పోటీ అనేది సహజమే కానీ.. ఎటు చూసినా కూలి చిత్రానికి పాజిటివ్ వైబ్స్ కనిపించాయి. వార్ 2 ని ప్రతి విషయంలో కూలి డామినేట్ చెయ్యడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.
వార్ 2 కి కూలి చిత్రంలో సగం కూడా హైప్ లేదు, లోకేష్ కనగరాజ్-రజినీకాంత్ కూలి తో కొట్టే రికార్డులను వార్ 2 అందుకోలేదు, కనీసం దరిదాపుల్లోకి కూడా రాదు అంటూ సోషల్ మీడియాలో కనిపించిన కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. కానీ ఇప్పుడు కూలి, వార్ 2 చిత్రాలు విడుదలయ్యాక సోషల్ మీడియా టాక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు.
కూలికి మిక్స్డ్ టాక్ వస్తే.. వార్ 2కి హిట్ టాక్ వస్తుంది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కూలి కి ఉన్న హైప్ 50% కూడా వార్ 2 కు లేదన్నారు. నా హీరో అని చెప్పట్లేదు, టైగర్స్(ఎన్టీఆర్-హృతిక్) ఆర్ గోయింగ్ టు విన్, ఎన్టీఆర్ నీ యాక్టింగ్ కి 👌🙏🧡 అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేస్తున్న ట్వీట్లు చూసి కూలి విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా రగిలిపోయి ఉన్నారో అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.