ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న బాలీవుడ్ స్పై యాక్షన్ యూనివర్స్ వార్2 నేడు ఆగష్టు 14 న థియేటర్స్ లోకి వచ్చేసింది. స్టార్ హీరోలైన హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలయికలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 చిత్రంపై భీభత్సమైన అంచనాలున్నాయి. ఎన్టీఆర్-హృతిక్ ల యాక్షన్ చూసేందుకు మాస్ ఆడియన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వార్ 2 ఓవర్సీస్ షోస్ కంప్లీట్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, హృతిక్ ఫ్యాన్స్ వార్ 2 టాక్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు.
వార్ 2 ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోయింది. జప్ అని దూసుకొచ్చే సీన్‌తో.. ల్యాండ్ అయ్యే సీన్‌తో.. థియేటర్లో ఫ్యాన్స్‌కైతే పిచ్చెక్కి పోద్ది. ఎన్టీఆర్ షర్ట్ లెస్ లుక్ చూస్తే షాకవడం పక్కా.. అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎగ్జైట్ అవుతూ వార్ 2 పై ట్వీట్లు వేస్తున్నారు. హృతిక్ ఎంట్రీ కూడా అదిరిపోయింది, ఎన్టీఆర్-హృతిక్ ఛేజింగ్ సీన్స్ సూపర్‌గా ఉన్నాయి.
ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్‌లో ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్-హృతిక్ ఎంట్రీని మ్యాచ్ చేస్తూ సంచిత్ అండ్ అంకిత్ BGM తో అద్దరగొట్టేసారు. ఇంట్రో సీన్స్, డ్యాన్స్, కొన్ని ట్విస్టులు, మంచి బ్లాక్‌లు వార్ 2 ని ఎక్కడో నిలబెడతాయి. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ చాలు. కొన్ని సీన్స్‌లో హృతిక్‌ను ఎన్టీఆర్ డామినేట్ చేస్తే.. మరి కొన్ని సీన్లలో ఎన్టీఆర్ ని హృతిక్ డామినేట్ చేసారు.
ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా నెక్ట్స్ లెవల్లోనే ఉంది. వార్ 2లో ఎన్టీఆర్ బెస్ట్ లుక్స్. కుమ్మేసాడు భయ్యా అంటూ ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తున్నారు.
అయితే మెయిన్ స్టోరీలో ఎమోషన్స్ ను సరిగా చూపించలేకపోయారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తమ పాత్రలను బాగా పోషించారు. కొన్ని విఎఫెక్స్ షాట్స్ కూడా తేలిపోయాయి.. అయినప్పటికి వార్ 2 లో హీరోలిద్దరూ గెలిచారంటూ పలువురు నెటిజెన్స్ వార్ 2 పై తమ స్పందనను తెలియజేస్తున్నారు.