ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మహానగరాలను ఈ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, గుంటూరు, విజయవాడ ఇలా ఎక్కడ చూసినా భారీ వర్షాలు కురవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
మరి ఈ వర్షాల ఎఫెక్ట్ రేపు గురువారం విడుదల కాబోతున్న వార్ 2, కూలి చిత్రాలపై ఎంతగా పడుతుందో అంచనా కూడా వెయ్యలేని పరిస్థితి. ప్రస్తుతం రెండు రోజుల పాటు తెలంగాణాలో, ఏపీలో అతి భారీ వర్షాలు కురవనున్నాయని GHMC, వాతారవరణ శాఖ హెచ్చరిస్తుంది. భారీ హైప్ తో రేపు రాబోతున్న ఈ రెండు సినిమాలకు ఈ భారీ వర్షాలు ఎంతెలా ఎఫెక్ట్ చేస్తాయో అని ఆయా హీరోల అభిమానులు కంగారు పడుతున్నారు.
వార్ 2 తో ఎన్టీఆర్, కూలి తో నాగార్జున ఇద్దరూ టాలీవుడ్ నుండి పోటీపడుతున్నారు. రెండు సినిమాలు డబ్బింగ్ మూవీస్ అయినా అందులోని హీరోలు తెలుగులో క్రేజ్ ఉన్న హీరోల కావడంతో అందరిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఓపెన్ అయిన కూలి, వార్ 2 బుకింగ్స్ లో రెండు నువ్వా-నేనా అని పోటీపడుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ విషయంలో ఏ సినిమా రికార్డులు తిరిగి రాస్తుందో అని వెయిట్ చేస్తున్న సమయంలో ఈ వర్షాలు వలన ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే చాలు అనే ఆలోచనలో ఫ్యాన్స్ కనిపిస్తుంది.
మరి ఈ వరదల్లో వార్ 2, కూలి పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఈ లాంగ్ వీకండ్ ని ఎవరు క్యాష్ చేసుకుంటారో చూడాలి.