సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే తమిళనాడులో కార్పొరేట్ ఆఫీసులకు సెలవు ప్రకటించేంత క్రేజ్ ఉంటుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సూపర్ స్టార్ సినిమా అంటే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. దానికి కింగ్ నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ లాంటి నటులు తోడైతే ఆ భారీ మల్టీస్టారర్ పై ఎంత అంచనాలుంటాయో, ఎంతగా హైప్ ఉంటుందో అదే కూలి చిత్రానికి ఉంది. కూలి చిత్రానికి ఓవర్సీస్ లో ఎంత క్రేజ్ ఉందొ.. పాన్ ఇండియా మర్కెట్ లో అంతకుమించి హైప్ కనిపించింది.
కూలి నేడు ఆగష్టు 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. ఓవర్సీస్ షోస్ కంప్లీట్ అవడంతో సూపర్ స్టార్ అభిమానులు, అక్కినేని ఫ్యాన్స్, లోకేష్ ఫ్యాన్స్.. ఓవరాల్ మూవీ లవర్స్ కూలి చిత్రం అలా ఉంది, ఇలా ఉంది అంటూ ట్వీట్లు వేస్తూ హడావిడి స్టార్ట్ చేసారు. ఇక కూలి ఓవర్సీస్ టాక్ లోకి వెళితే..
టైటిల్ కార్డ్ నుంచి హీరోల ఇంట్రో సీన్స్ వరకు అభిమానుల అంచనాలకు మించి ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ని సూపర్బ్ గా ప్రెజెంట్ చేసారు. సైమన్ రోల్ లో నాగార్జున సర్ ప్రైజ్ చేశారు. నెగెటివ్ క్యారెక్టర్ లో సౌబిన్ ఓపెనింగ్ సీక్వెన్స్ అద్దిరింది. ఆమిర్ ఖాన్ పవర్ ఫుల్ క్యామియో అదిరిపోయిందని ఓవర్సీస్ లోని కొంతమంది ఆడియన్స్ ట్వీట్లు వేస్తున్నారు.
ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తాయని, అనిరుధ్ రవిచందర్ సాంగ్స్, BGM స్పెషల్ అట్రాక్షన్, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పూజ హెగ్డే మౌనిక సాంగ్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్. కానీ సాంగ్ ప్లేస్ మెంట్ సెట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ను నాగార్జున మరియు సౌబిన్ షాహిర్ చాలా వరకు సేవ్ చేసారు. సినిమా స్టార్ట్ అయిన మొదటి గంట వరకు చాలా ఫ్లాట్ గా సాగుతుంది. ఒకే ఒక ఫైట్ హై ఫీల్ ఇస్తుంది తప్ప రిమైనింగ్ అంతా వీక్ నేరేషన్ లో సాగుతుంది.
సెకండాఫ్ స్టార్ట్ అవడమే నీరసంగా స్టార్ట్ అయిన కూలీని లోకేష్ ఎక్కడా తన క్రియేటివిటీ చూపించలేకపోయాడు. కూలి క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు తప్ప సినిమాలో చెప్పుకోవానికి ఏమి లేదు అంటూ చాలామంది ఆడియన్స్ కూలి పై తమ రెస్పాన్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
చూద్దాం కూలి ఓవరాల్ టాక్ ఏమిటి, కూలి లో విషయమెంతుంది అనేది పూర్తి రివ్యూలో మరికాసేపట్లో..