హిందీ లో సక్సెస్ కాక సౌత్ లోకి వచ్చి అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన బుట్టబొమ్మ పూజ హెగ్డే ఒకొనొక సమయంలో టాలీవుడ్ టాప్ చైర్ కి ఎక్కిందా అనుకునేలోపు నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూపంలో ఆమెకు గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ రష్మిక కు రాని ఛాన్సులు పూజ హెగ్డే తలుపు తట్టాయి. టాలీవుడ్ టాప్ హీరోస్ అందరితో ఆల్మోస్ట్ జోడి కట్టింది.
అదే స్టార్ హీరోలు పూజ హెగ్డే కు టాలీవుడ్, కోలీవుడ్ లలో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఇవ్వడంతో డల్ అయ్యి మళ్లీ హిందీలోకి వెళ్లి మూడేళ్ళ బ్రేక్ తో సౌత్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే కోలీవుడ్ లో స్టార్ హీరోల ఛాన్సులతో మళ్లీ బిజీ అయ్యింది. సూర్య, విజయ్, లారెన్స్, కూలీ లో స్పెషల్ సాంగ్ తో హడావిడి మొదలు పెటింది.
తాజాగా పూజ హెగ్డే సౌత్ లో తనకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. నాకు సౌత్ లో నటనకు స్కోప్ ఉన్న కేరెక్టర్స్ దొరికాయి కానీ హిందీలో అలా కాదు. బాలీవుడ్ తనకు సరైన పాత్రలు ఇవ్వలేదని, అక్కడి దర్శకనిర్మాతలు తనను కేవలం గ్లామర్ హీరోయిన్ లాగే చూశారని.. పెద్దగా గుర్తింపు లేని పాత్రలే తనకు అక్కడ దక్కాయంటూ పూజ హెగ్డే హిందీ పరిశ్రమపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.