మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పడు డైరెక్ట్ గా హిందీలో లక్కు ను టెస్ట్ చేసుకోబోతున్నాడు. ఆర్.ఆర్.ఆర్, దేవర చిత్రాలతో ఇప్పటికే హిందీ బాక్సాఫీసుని టచ్ చేసిన ఎన్టీఆర్ ఈసారి డైరెక్ట్ గా నార్త్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కి ఏం చెప్పి ఒప్పించాడో, ఎన్టీఆర్ ఎందుకు వార్2 ఒప్పుకున్నాడో అనే విషయంలో ఇప్పటికే ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చాడు.
అయితే తాజాగా వార్2 చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో ఉన్నారు, మరి ఈ లెక్కన ఎన్టీఆర్ పాత్ర ఎంత హైలెట్ అవుతుందో అనే విషయంలో చాలా రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా వార్ 2లో ఎన్టీఆర్ కేరెక్టర్ పై క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వార్2 స్టార్ట్ అయ్యాక ఎన్టీఆర్ 20 నిమిషాల్లోపే ఎంట్రీ ఇస్తాడట, అంతేకాదు వార్ 2లో ఫస్ట్ హాఫ్ మొత్తం హృతిక్ పై ఎన్టీఆర్ డామినేషన్ కనిపిస్తుంది అనే వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఫుల్ గా ఎగ్జైట్ చేస్తుంది.
వార్ 2 లో ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది అని, ఫ్యాన్స్ కు, మాస్ ఆడియన్స్ కు వార్ 2లో ఫుల్ శాటిస్ ఫైయింగ్ క్లయిమాక్స్ చూస్తారట. మరి ఈలెక్కన వార్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. చూద్దాం వార్ 2 ఏ రేంజ్ హిట్ అయ్యి ఎన్నెన్ని రికార్డులను తిరగరాస్తుందో అనేది.