కన్నడ లో కెజిఎఫ్, కాంతార చిత్రాల తర్వాత ఆ ఇండస్ట్రీ నుంచి అంతగా మోగిన పేరు సు ఫ్రమ్ సో. సు ఫ్రమ్ సో చిత్రం జేపీ తుమినాడ్ దర్శకత్వంలో తెరకెక్కి జులై 25 న కన్నడలో విడుదలైంది. కేవలం 5.5 కోట్ల రూపాయల చిన్న బడ్జెట్ తో నిర్మించిన సు ఫ్రమ్ సో 80 కోట్లకు పైగా కలెక్షన్స్ తేవడంతో అందరి చూపు సు ఫ్రమ్ సో పై పడింది.
ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం చూసి ఆడియన్స్ అంతగా ఇంప్రెస్స్ అవడం ఆశ్చర్యపరిచింది. అందుకే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు తెలుగులో విడుదల చేసారు. అయితే సు ఫ్రొం సో ను తెలుగు ఆడియన్స్ అంతగా ఆదరించలేదు.
కారణం ఈ చిన్న సినిమా ఓటీటీలోకి వచ్చాక, ఓటీటీలో చూద్దాం లే.. థియేటర్ లోకి వెళ్లి ఏం చూస్తాం లే అన్నట్టుగా అంతగా పట్టించుకోలేదని తెలుస్తుంది. సు ఫ్రొం సో కి తెలుగు లో అంతగా రెస్పాన్స్ లేదు. ఇక ఇప్పుడు ఈ చిన్న చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని కన్నడ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.