మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ రేపు గురువారం వార్ 2 హిందీ మూవీ తో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. హిందీలో తెరకెక్కిన వార్ 2 ను ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత నాగవంశీ సితార బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వార్ 2 తెలుగు నిర్మాతలు ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లను కలిసి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరారు.
దానితో ఏపీ ప్రభుత్వం వార్ 2 సింగిల్ స్క్రీన్లలో రూ. 75, మల్టీప్లెక్సుల్లో రూ. 100 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రేపు గురువారం సినిమా రిలీజ్ రోజున ఉదయం 5 గంటలకు స్పెషల్ షోకు టికెట్ల రేట్లను రూ. 500 గా నిర్ణయించింది. ఏపీలో పెరిగిన టికెట్ రేట్లు ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా వార్ 2 టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. వార్2 విడుదల సందర్భంగా కొత్త జీఓను ఆమోదించినందుకు గానూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.