బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ లు హాజరయ్యారు. ప్రకాష్ రాజ్ ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యను అని చెప్పారు. విజయ్ దేవరకొండ నేను బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేశాను అని వివరణ ఇచ్చారు.
రానా గత సోమవారం విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు మంచు లక్ష్మి వంతు వచ్చింది. మంచు లక్ష్మి ఈరోజు ఆగష్టు 13 బుధవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. బెట్టింగ్ యాప్ విచారణను ఆమె ఎదుర్కోనున్నారు.
మరి ఈడీ విచారణ తర్వాత మంచు లక్ష్మి మీడియా ముందు ఏం మట్లాడతారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.