సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలి రేపు గురువారం ఆగష్టు 14 న విడుదల కాబోతుంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న కూలి చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
కూలి విడుదల రోజు అంటే ఆగష్టు 14 ఉదయం 5 గంటల షోకు అనుమతి కూడా ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కూలి సినిమా విడుదల రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 టికెట్ రేట్స్ పెంపుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.