రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చిత్రం చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి పాన్ ఇండియా మర్కెట్ లో 100 ల కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత రిషబ్ శెట్టి కాంతార కి ప్రీక్వెల్ పనులు మొదలు పెట్టి కాంతార చాప్టర్ 1 అంటూ షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే కాంతార 1 షూటింగ్ మొదలైనప్పటి నుంచి యూనిట్ ని ఏదో ఒక విషాదం వెంటాడుతుంది.
ఒకసారి జూనియర్ ఆర్టిస్ట్ ల బస్సు బోల్తా పడితే, మరోసారి యూనిట్ సభ్యుడు హార్ట్ ఎటాక్ తో మరణించడం, ఇంకోసారి యూనిట్ సభ్యుల్లో ఒకరు నీళ్లల్లో మునిగి చనిపోవడం, రిషబ్ శెట్టి ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయి కెమెరాలు తడిచిపోవడం, అంతేకాకుండా కాంతార సెట్ లో అగ్నిప్రమాదాలు జరగడం వంటి విషయాలతో చిత్ర బృందం సతమతమయ్యింది,
అయితే కాంతార విషాదాలపై కాంతార ప్రొడ్యూసర్స్ లో ఒకరైన చలువే గౌడ స్పందిస్తూ కాంతార కష్టాల వెనుక అసలు కథ చెప్పారు. కాంతార చాప్టర్ 1 స్టార్ట్ చేసినప్పటి నుంచి చిత్ర బృందంలో జరిగింది తక్కువ ప్రమాదాలే. కొల్లూరు సెట్ లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల కొందరు యూనిట్ సభ్యులు గాయపడ్డారు.
ఆ తర్వాత రిషబ్ శెట్టి పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కెమెరా లాంటి పరికరాలు నీటిలో మునిగిపోయాయి తప్పించి ఆ ప్రమాదంలో ఎవరికి ఏం కాలేదు. కాంతార చాప్టర్ 1 మొదలుపెట్టడానికి ముందే గ్రామదేవత పంజుర్లీని అడిగితే కొన్ని అవాంతరాలు వచ్చినా షూటింగ్ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారని చెప్పింది. ఆ దేవత చెప్పినట్టుగానే కాంతార 1 షూటింగ్ పూర్తి చేసి విడుదలకు రెడీ చేస్తున్నాం. మధ్యలో జరిగిన కొన్ని ప్రమాదాలు కాంతార యూనిట్ కి ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.