ఆంధ్ర అమ్మాయి బ్యాంకాక్ వెళ్లి అక్కడ చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెర్ గా మారి ఫేమస్ అయ్యింది. బ్యాంకాక్ పిల్ల శ్రావణి ఇప్పుడు మొదలు కాబోయే బిగ్ బాస్ 9 లోకి అడుగుపెడుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. విజయనగరానికి చెందిన శ్రావణి సామంతపూడి బ్యాంకాక్ లో ఉద్యోగ రీత్యా స్థిరపడి తన యాసలో అనేక వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యింది.
యూట్యూబ్ లో ఆమె వీడియోలకు మంచి రెస్పాన్స్ ఉంది. దానితో ఆమె గత కొన్ని సీజన్స్ గా బిగ్ బాస్ లోకి వెళుతుంది అనే ప్రచారం జరిగినా ఆమె మాత్రం అలాంటిదేమి లేదు అని ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ వచ్చింది. తాజాగా ఈ బ్యాంకాక్ పిల్ల శ్రావణి పేరు బిగ్ బాస్ సీజన్ 9 లో వినిపిస్తుంది.
సెప్టెంబర్ మొదటివారంలో మొదలు కాబోయే ఈ బిగ్ బాస్ సీజన్ 9 రణరంగంలోకి ఎవరెవరు అడుగుపెడతారో అనేది హాట్ స్టార్ లో ప్రసారమయ్యే అగ్నిపరీక్ష చూస్తే తెలుస్తుంది. కొన్నివేల అప్లికేషన్స్ ను ఫిల్టర్ చేసి మరీ 40 మందిని సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ వడపోసి మరీ బిగ్ బాస్9 కోసం కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతుంది. చూద్దాం ఈ బ్యాంకాక్ పిల్ల ఈ సీజన్ హౌస్ లో కనిపిస్తుందేమో అనేది.