ఆగష్టు 14 భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీస్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కూలి, వార్ 2 వేటికవే ప్రత్యేకతతో వస్తున్నాయి. వార్ 2 భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఎన్టీఆర్-హృతిక్ నడుమ హెవీ యాక్షన్ సీక్వెన్స్ తో హైప్ క్రియేట్ చేస్తే.. కూలి సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర లాంటి భారి స్టార్ క్యాస్ట్ తో ఇంట్రెస్టింగ్ గా కనిస్తుంది.
వార్ 2 vs కూలి అన్న రేంజ్ లో బాక్సాఫీసు వార్ కనిపిస్తే ఇప్పుడు ఈ రెండు చిత్రాలను ఓ సినిమా టెన్షన్ పెడుతుంది. అదే మహావతార్ నరసింహ. హోంబులే ఫిలిమ్స్ వారి మహావతార్ నరసింహ ఎలాంటి అంచనాలు లేకుండా 200 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ మహావతార్ నరసింహ థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి అంటే ఆ సినిమా రేంజ్ ఏమిటి అనేది అర్ధమవుతుంది.
మహావతార్ నరసింహ 300కోట్ల మార్క్ చేరుకుంటుందా అనే అనుమానాలు కలిగేలా మహావతార్ నరసింహ బాక్సాఫీసు జోరు కనిపిస్తుంది. హిందీ బాక్సాఫీసు దగ్గరే ఈ చిత్రం 100కోట్ల మార్క్ టచ్ చేసింది. మరి ఇదే జోరు కొనసాగితే వార్ 2 పై కూలి పై మహావతార్ నరసింహ ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు అనేది ట్రేడ్ వర్గాల అంచనా.