పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు సందీప్ వంగ స్పిరిట్ సెట్ లోకి అడుగుపెడతారా అని ప్రభాస్ అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. గత ఏడాది కాలంగా అదిగో ఇదిగో అనడమే కానీ.. స్పిరిట్ మూవీ మొదలైంది లేదు. ఇప్పుడు కూడా సెప్టెంబర్ నుంచి స్పిరిట్ మొదలవుతుంది అని సందీప్ వంగ చెప్పినప్పటికి ప్రభాస్ నటిస్తోన్న రాజా సాబ్, ఫౌజీ షూటింగ్స్ ఫినిష్ కాలేదు.
దానితో సెప్టెంబర్ లోను స్పిరిట్ మొదలవ్వదనే ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సందీప్ రెడ్డి వంగ సెప్టెంబర్ చివరి నాటికి పూజా కార్యక్రమాలతో స్పిరిట్ ని పట్టాలెక్కించబోతున్నారట. మొదటి షెడ్యూల్ ను విదేశాల్లో చేసేందుకు లొకేషన్స్ ను సెట్ చేసి పెట్టుకున్నారట. మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్ ఇలా కొన్ని లొకేషన్స్ ను సందీప్ వంగ ఫైనల్ చేశారట.
స్పిరిట్ కు సంబందించిన పలు కీలక షెడ్యూల్స్ షూటింగ్ అక్కడే జరగబోతుంది అని సమాచారం, డ్రగ్ మాఫియా నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ని సందీప్ వంగ స్పిరిట్ లో చూపించబోతున్నారు. అయితే ప్రభాస్ స్పిరిట్ సెట్ లోకి నవంబర్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది అంటున్నారు. స్పిరిట్ లోప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది.