మిస్టర్ బచ్చన్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే కి ఆ చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. కానీ అమ్మడుకు మిస్టర్ బచ్చన్ మంచి ఆఫర్లు వచ్చేలా చేసింది. మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టింది. రీసెంట్ గా భాగ్యశ్రీ బోర్సే నటించిన కింగ్ డమ్ విడుదలైంది.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. అలాగే కింగ్ డమ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వకపోవడం భాగ్యశ్రీ బోర్సే ను డిజప్పాయింట్ చేసింది. ఆ చిత్రం భాగ్యశ్రీ బోర్సేకు ఎలాంటి హెల్ప్ అవ్వలేదు. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే నటించిన కాంత విడుదలకు సిద్దమవుతుంది. ఆ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే పెరఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర మాత్రమే అన్నట్టుగా ఉంది టీజర్ చూస్తే. గ్లామర్ చూపించే స్కోప్ ఉన్నట్టుగా లేదు.
సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ గా కనిపించే భాగ్యశ్రీ బోర్సే తాజాగా షేర్ చేసిన పిక్స్ చూసి ఈ అమ్మడుకు కాంత తో అయినా లక్కు స్టార్ట్ అవుతుందేమో చూడాలంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే నటించిన కాంత చిత్రం సెప్టెంబర్ 12 న విడుదలకు రెడీ అవుతుంది.