కింగ్ నాగార్జున మొట్టమొదటిసారి సూపర్ స్టార్ కూలి చిత్రంలో విలన్ గా సైమన్ పాత్రలో కనిపించబోతున్నారు. నాగార్జున ఫస్ట్ టైమ్ విలన్ గా కనిపించడమే కాదు ఆ పాత్రపై కూలి స్టార్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా హైప్ పెంచేలా మాట్లాడుతున్నారు. తాజాగా నాగార్జున కూడా తను చేసిన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
నేను కూలి చిత్రంలో చేసిన పాత్ర గురించి నా మనవాళ్లకు అస్సలు చెప్పను. ఎందుకంటే నేను చేసిన సైమన్ పాత్ర అంత బ్యాడ్ గా ఉంటుంది అంటూ కింగ్ నాగ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంకా నాగార్జున రజినీకాంత్ గురించి చెబుతూ..
సూపర్ స్టార్ తో వర్క్ చెయ్యడం నిజంగా అద్భుతమైన ఎక్స్ పీరియన్స్, సెట్ లో రజిని ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. తమిళ డైలాగ్స్ విషయంలో ఆయన చాలా హెల్ప్ చేశారు. నేను ఎంత నెగెటివ్ రోల్ లో కనిపించినప్పటికీ ఆయన సెట్ లో దానిని అంత పాజిటివ్ గా మార్చేసారు అంటూ నాగార్జున రజినీపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.