మార్కెట్లో ఒక వాటర్ బాటిల్ ధర.20/-. రైల్వేస్ లో ఐఆర్‌సిటిసి విక్రయించే వాటర్ బాటిల్ వెల రూ.15/-. ఒక లీటర్ కు. రూ.10 కే 500 ఎం.ఎల్ వాటర్ బాటిల్ దొరుకుతుంది. కానీ బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ 750 ఎం.ఎల్ వాటర్ బాటిల్ ని ఏకంగా రూ.200 కు అమ్ముతోంది. 500 ఎం.ఎల్ వాటర్ బాటిల్ కొనాలంటే రూ.150 చెల్లించాలని అంటోంది.
ఇటీవలే వాటర్ ప్లాంట్ ప్రారంభించిన భూమి ఫెడ్నేకర్ తన ప్లాంట్ గొప్పతనం గురించి ఇలా చెప్పుకొచ్చింది. తమ వద్ద నీటి తయారీ ఎలాంటి కలుషిత వాతావరణం లేకుండా హైజీనిక్ గా ఉంటుందని, కనీసం మనుషులు కూడా చేతులతో నీటిని తాకేందుకు ఆస్కారం లేదని చెప్పింది. అందుకే ఇప్పుడు ప్రీమియం వాటర్ బాటిల్ ధరల్ని ధైర్యంగా ప్రకటించింది. అయితే అంత ధర పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కునేది ఎవరు? అనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు.
భూమి బ్రాండ్ `హిమాలయన్` మార్కెట్లోకి వస్తే, తాను కుళాయి నీళ్లు తాగడం మానేస్తానని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. కొందరైతే ఇకపై తాను నీళ్లు కూడా తాగడం మనేస్తామని శపథం చేసారు. భూమి విక్రయించబోతున్న వాటర్ బాటిల్ ధరలు చూశాక.. నెటిజనులు షాక్ కి గురవుతున్నారు. భూమి వ్యాపారంలోకి రావడానికి కారణం సినిమాలు లేకపోవడమేనని కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. అర్జున్ కపూర్ తో కలిసి భూమి `మేరే హజ్బెండ్ కి బివీ` అనే చిత్రంలో నటించింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ మరో కథానాయికగా నటించింది.