ప్రముఖ నేపథ్య గాయని ఆశాభోంస్లే మనవరాలు జానియా భోంస్లే, యంగ్ డైనమిక్ క్రికెటర్ సిరాజ్ తో డేటింగ్ చేస్తోందంటూ పుకార్లు వచ్చాయి. ఆ ఇద్దరూ అత్యంత సన్నిహితంగా కనిపించిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఇంతకుముందు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. అయితే ఈ పుకార్లను ఆ ఇద్దరూ ఖండించారు. తమ మధ్య ఉన్నది కేవలం సోదరసోదరీమణుల అనుబంధం మాత్రమేనని క్లారిటీనిచ్చారు.
ఈ శనివారం రాఖీ పండగ సందర్భంగా మరోసారి ఇది నిరూపణ అయింది. సిరాజ్ కి జానియా రాఖీ కడుతూ కనిపించింది. ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్యా సోదరసోదరీమణుల బంధం కనిపించింది. అన్నయ్యకు చెల్లెమ్మ రాఖీ కడుతుంటే ఆ ఆప్యాయత ఆ కళ్లలో కనిపించింది. వారి అన్నా చెల్లెళ్ల బంధంలోని స్వచ్ఛత కనిపించింది.
ఒకే ఒక్క రాఖీతో ఆ ఇద్దరూ అన్ని రూమర్లకు చెక్ పెట్టారు. ఆశాభోంస్లే భారతదేశంలో పాపులర్ గాయని. ఇప్పుడు ఆశాజీ స్ఫూర్తితో మనవరాలు జానియా కూడా గాయనిగా రాణిస్తోంది. జానియా లైవ్ స్టేజ్ పెర్ఫామెన్సెస్ తో అదరగొడుతున్న ఫోటోలు వీడియోలు ఇన్ స్టాలో వైరల్ గా మారుతున్నాయి. రెహమాన్ తో కాన్సెర్టుల్లోను జానియా భోంస్లే కనిపించింది. అందానికి అందం, ప్రతిభతో ఈ భామ వేవ్స్ క్రియేట్ చేస్తోంది.