క్యూట్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమాలో ఎంత పద్దతిగా కనిపిస్తుందో సోషల్ మీడియాలో అందాలతో అంత రచ్చ చేస్తుంది. ట్రెడిషనల్ చీర కట్టులోనూ అందాలను అద్భుతంగా చూపించగల సత్తా జాన్వీ కపూర్ లో ఉంది. కానీ ఇప్పుడు జాన్వీ కపూర్ షేర్ చేసిన పిక్స్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే.
జాన్వీ కపూర్ లంగా ఓణీ లో బాపు బొమ్మలా, కుందనపు బొమ్మలా చక్కగా కనిపించింది. అందానికి అందం, అణుకువ తో జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. గోల్డ్ కలర్ లేస్ ఉన్న హాఫ్ శారీ లో మెడ లో హెవీ నెక్ లెస్, చెవులకు పెద్ద పెద్ద బుట్టలు,హెయిర్ కొప్పు పెట్టుకుని, నుదుటున బొట్టు తో జాన్వీ కపూర్ పక్కా ట్రెడిషనల్ గా కనిపించింది.
ప్రస్తుతం ఈ కుందనపు బొమ్మ పెద్ది చిత్రంలో నటిస్తుంది. ఆమె నటించిన హిందీ చిత్రం పరం సుందరి విడుదలకు రెడీ అవడమే కాదు.. ఆ చిత్ర ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు ఆడియన్స్ మైమరిచిపోతున్నారంటే నమ్మాలి.