కింగ్ నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్ మొదటి వారంలో మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ 9 పై హైప్ పెంచేందుకు యాజమాన్యం చాలా రకాల ప్లాన్స్ చేస్తుంది. తాజాగా నాగార్జున తో కమెడియన్ వెన్నెల కిషోర్ ఉన్న ప్రోమో ని వదిలారు. నా నెక్స్ట్ 100 డేస్ షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసెయ్యండి, నేను బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ వెన్నెల కిషోర్ చెప్పడం.. దానికి ఆయన డ్రైవర్ షాకవడం..
ఆ తర్వాత నాగ్ మాయాజాలం చేస్తున్నట్లుగా ఎంట్రీ ఇవ్వడం.. ఏయ్ కిషోర్ అనగానే వెన్నెల కిషోర్ మీరా అంటూ సర్ ప్రైజ్ అవడం, హౌస్ లోకి వెళ్ళడానికి వచ్చావా అని నాగ్ అడగగానే, దానిలోకి వెళ్ళడానికి కాదు హౌస్ ని ఏలడానికే వచ్చాను అంటూ వెన్నెల కిషోర్ బిల్డప్ ఇస్తే అది నీ వల్ల కాదు.. ఇది చాలా టఫ్ అన్నారు నాగ్, దానికి కిషోర్ నేను వెరీ రఫ్ అంటూ స్టయిల్ పోయాడు.
నేను డైరెక్ట్ గా బిగ్ బాస్ తోనే మాట్లాడుకుంటాను, నేను ఆల్ సీజన్స్ అన్ని ఎపిసోడ్స్ చూసేసాను అంటూ వెన్నెల కిషోర్ అనగానే.. ఈసారి బిగ్ బాస్ నే మార్చేసాను అంటూ నాగ్ షాకిచ్చారు. ఈ సీజన్ లో అందరి సరదాలు తీరిపోతాయి, ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగ్ చెప్పడం ప్రోమోలో హైలెట్ అయ్యాయి.