ఆగష్టు 27 న మాస్ జాతర అంటూ మాస్ ఎంటర్టైనర్ తో రాబోతున్న మాస్ మహారాజ్ రవితేజ.. ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ చేసారు. కుర్ర నిర్మాత నాగవంశీ నిర్మాణ సారథ్యంలో భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితో రవితేజ మాస్ జాతర సినిమా చేసారు. ఈ సినిమా కోసం ధమాకా తో హిట్ కొట్టిన శ్రీలీల ను హీరోయిన్ గా పట్టుకొచ్చారు.
తాజాగా మాస్ జాతర నుంచి టీజర్ వదిలారు మేకర్స్.. మాస్ జాతర టైటిల్ కి తగ్గట్టుగానే టీజర్ కూడా ఉంది. రవితేజ ఎనెర్జిటిక్ పెరఫార్మెన్స్ కి తోడు ఆయన లుక్స్ విషయంలో అయితే అభిమానులు చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు. రైల్వే పోలీస్ గా రవితేజ యాక్షన్ మాత్రం సూపర్బ్ అనేలా ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్స్ లో వేలు పెడుతూ ఉంటాడు అంటూ రవితేజ కేరెక్టర్ కి ఇచ్చిన మాస్ ఎలివేషన్ అద్దిరిపోయింది.
అలాగే శ్రీలీల తో రొమాంటిక్ సన్నివేశాలు, శ్రీలీల డాన్స్ స్టెప్స్, రాజేంద్ర ప్రసాద్ తో రవితేజ కాంబో సీన్స్ అన్ని టీజర్లో హైలెట్ అవడమే కాదు.. మ్యూజిక్, BGM, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్ గా ఉన్నాయి. మాస్ జాతర టీజర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే రవితేజ వన్ మ్యాన్ షో..