బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ రంగానికి చెందిన పలువురి సెలబ్రిటీస్ కి నోటీసులు ఇచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయం విచారణకు పిలిచింది. సైబరాబాద్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది.
ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇకముందు తాను ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయనని, హానికరమైన వ్యాపారాల ప్రమోషన్ల విషయంలో దూరంగా ఉంటానని విచారణ అనంతరం మీడియా ముందు ప్రకాష్ రాజ్ ప్రకటించారు.
ఇక విజయ్ దేవరకొండ తాను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదని, తాను ప్రమోషన్ చేసింది గేమింగ్ యాప్ అని, అన్ని అనుమతులు ఉన్నలీగల్ గా కొనసాగుతున్న గేమింగ్ యాప్ ప్రమోషన్ లో పాల్గొన్నానని విచారణ అనంతరం విజయ్ దేవరకొండ ప్రకటించారు.
ఈ కేసులో ఈరోజు ఆగష్టు 11న హీరో దగ్గుబాటి రానా ఈడీ ముందుకు రాబోతున్నారు. రానాను నేడు ఈడీ విచారణ చేయనుంది. ఎల్లుండి ఈ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు నటి మంచు లక్ష్మీ హాజరుకానుంది.