కాంతార చాప్టర్ 1 షూటింగ్ మొదలయ్యాక కాంతార యూనిట్ లో పలు రకాల విషాదాలు చోటు చేసుకున్నాయి. పలు సందర్భాల్లో కాంతార యూనిట్ సభ్యులు అనుకోకుండా మరణించడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. కాంతార 1 చిత్ర బృందం ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరగడం, తర్వాత ఒకరిద్దరు గుండెపోటుతో మరణించగా మరో యూనిట్ సభ్యుడు స్నేహితులతో కలిసి చెరువులోకి దిగి అనుకోకుండా మునిగి చనిపోవడం ఇలా పలు విషాదాలు కాంతార యూనిట్ ను వెంటాడాయి.
ఇప్పుడు కాంతార యూనిట్ లో మరో విషాదం చోటు చేసుకుంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రంలో నటించిన దున్నపోతు అప్పు కన్నుమూసింది. వయోభారంతో అప్పు కన్ను ముయ్యడం కాంతార యూనిట్ లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దున్నపోతు అప్పు కరావళి భాగంలో అనేక కంబళ పోటీల్లో పాల్గొని పథకాలు తీసుకొచ్చింది.
బెంగుళూర్ లో జరిగిన కంబళ పోటీల్లో అప్పు పాల్గొని ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. కంబళ దున్నపోతులను యజమానులు కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఈ అప్పు కాంతార చిత్రంలో చాలా సన్నివేశాల్లో కనిస్తుంది. దున్నపోతు అప్పుకి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.