బుట్టబొమ్మ పూజ హెగ్డే కి టైమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆమె అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన పూజ హెగ్డే కి రాధేశ్యామ్, బీస్ట్ అంటూ వరస వైఫల్యాలు స్టార్ట్ అయ్యాక పూజ హెగ్డే క్రేజ్ అమాంతం పడిపోయింది. రెట్రో తో కమ్ బ్యాక్ అయిన పూజ హెగ్డే కి మళ్లీ నిరాశే ఎదురైంది.
తాజాగా పూజ హెగ్డే సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి లో మోనికా సాంగ్ లో గ్లామర్ చూపించడమే కాదు సౌబిన్ తో కలిసి డాన్స్ స్టెప్స్ అద్దరగొట్టేసింది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజికల్ ఆల్బమ్ లో ఈ సాంగ్ బాగా హిట్ అయ్యింది. పాటలో పూజ హెగ్డే పేరు మార్మోగిపోయింది. మరి సాంగ్ హిట్టే.. ఆగష్టు 14 న రాబోయే కూలి కూడా హిట్ అయితే.. మళ్లీ పూజ హెగ్డే ఫామ్ లోకి వచ్సినట్టే.
అదే ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కొన్నాళ్ళుగా ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకున్న పూజ హెగ్డే కి కూలి చిత్రంతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని వారు కోరుకుంటున్నారు. కూలి చిత్రంలో ఆమె కేవలం స్పెషల్ సాంగ్ మాత్రమే చేసింది. అయినప్పటికీ కూలి హిట్ అయితే పూజ హెగ్డే టైమ్ స్టార్ట్ అవుతుంది.
ప్రస్తుతం అన్ని వైపులా నుంచి కూలి కి మంచి హైప్ ఉంది. అంతేకాదు కూలి ఓపెనింగ్స్ తో ఓ రికార్డ్ సెట్ చెయ్యడానికి రెడీగా ఉంది. చూద్దాం పూజ హెగ్డే లక్ ఎలా వుందో అనేది.