గత సోమవారం మొదలైన సినీకార్మికుల సమ్మె రెండో వారంలోకి ఎంటర్ అవ్వబోతుంది. సినిమా షూటింగ్స్ ఎక్కడిక్కడ ఆగిపోయాయి. సినిమా కార్మికుల వేతనాల విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. తాజాగా కార్మికుల సమ్మెపై అనిల్ వల్లభనేని మట్లాడుతూ..
కార్మికుల వేతనాల పెంపు గురించి గత 8 రోజులుగా సమ్మె చేస్తున్నాం..
ఎవరయితే 30 శాతం వేతనాలు ఇస్తున్నారో వారికి మాత్రమే పని చేస్తున్నాం..
ఫిలిం ఛాంబర్ తో చర్చలు జరిగాయి. నిన్న పరిష్కారం అయిపొతుందని నమ్మాం.
మేమేమి గెంతెమ్మ కొరికలు కొరలేదు, తొలుత 20 పర్సెంట్ ఇవ్వండి.. రెండేళ్ల తరువాత 10 పర్సెంట్ పెంచమని అడిగాము.
వాళ్లెదో ఎడాదికో పర్సెంటేజ్ చెప్పారు
అది కూడా కొన్ని యూనియన్ లకు అసలు పెంచమన్నారు.
ఫైటర్స్ డాన్సర్స్ టెక్నిషియన్స్ కు కూడా పెంచాలి.
పొట్ట కాలితే వారే దానికొస్తారు అనేలా నిర్మాతలా చర్యలున్నాయి.
అందరి కార్మికులకు వేతనాలు పెంచాలి.
ఎల్లండి లేబర్ కమీషనర్ ఆఫీసర్ వద్దకు రమ్మన్నారు.
ఈలోపు ఛాంబర్ తో చర్చలు జరపమన్నారు
ఛాంబర్ తో చర్చలు సఫలం కాకుంటే సమ్మె కొనసాగుతుంది.
విశ్వ ప్రసాద్ నోటీసులపై లీగల్ గా వెళతాం.
మాకు విశ్వ ప్రసాద్ నుంచి 90 లక్షల బకాయిలు రావాల్సి ఉంది.
విశ్వప్రసాద్ మాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మా కార్మికులు గట్టిగా కొరుకుంటున్నారు
వారికి ఎదైనా ఇబ్బంది ఉంటే వారు ఛాంబర్ కు చెప్పాలి.. ఎలా పడితే అలా మాట్లాడకూడదు..
చిరంజీవి గారు ఎప్పటికప్పుడు మా వివరాలను తెలుసుకుంటూ ఉన్నారు.
కోమటిరెడ్డి గారికి మా కార్మికుల పక్షాన నిలబడినందుకు ధన్యవాదాలు.. వారిని కలుస్తాం
ఫ్రభుత్వం జొక్యం అంటే వారి సూచనలు చేస్తారు, ఎదైనా ఛాంబర్ డెషిషనే ఫైనల్.
మొత్తం 24 వేల మంది కార్మికులు ఉన్నాం..
అవసరమయితే ఆమరణనిరాహార దీక్ష చేస్తాం.
ఫిలిం ఛాంబర్ తో ఇప్పుడు కూడా టచ్ లోనే ఉన్నాం, పిలుపొస్తే వెళ్లి మాట్లాడతాం.