సాయి ధరమ్ తేజ్ తో చేసిన రిపబ్లిక్ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాబట్టడంలో తడబడిన దర్శకుడు దేవ కట్ట చాలా గ్యాప్ తీసుకుని డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టారు. కిరణ్ జయ కుమార్ తో కలిసి దేవ కట్ట మయసభ వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేసారు. మయసభను ఆగస్టు 8 న ఓటీటీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. సోని లివ్ ప్లాట్ ఫామ్ నుంచి మయసభ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.
రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన వైఎస్ రాజసుఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను స్ఫూర్తిగా తీసుకుని ఈ వెబ్ సీరీస్ ని డిజైన్ చేసారు అనేది అందరికి తెలిసిన విషయమే. తాజాగా స్ట్రీమింగ్ లోకి వచ్చిన మయసభ కు సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ కనిపించడమే కాదు సినీవిమర్శకులు సైతం సూపర్ రివ్యూస్ ఇస్తున్నారు.
మయసభకు కిరణ్ జయ్ కుమార్ కూడా ఓ దర్శకుడు కానీ.. ఈ సీరీస్ మొత్తంలో దేవ కట్ట పేరునే మార్మోగిపోతోంది. ఆయన ఎక్కువగా హైలెట్ అవడమే కాదు.. దేవ కట్ట మేకింగ్ స్టయిల్ కి ఓటీటీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఆది పినిశెట్టి, చైతన్యరావు, సాయికుమార్, నాజర్ లాంటి స్టార్స్ ని చక్కగా వాడుకుని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అదిరిపోయే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, డైలాగ్స్ అన్ని మయసభ కు ప్లస్ పాయింట్స్ కావడంతో ఈ సీరీస్ కి అన్ని వైపులా నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది.
సో ఈ వీకెండ్ థియేటర్స్ లో, ఓటీటీలలో అదిరిపోయే సినిమాలు, సిరీస్ లు లేకపోయినా ఆడియన్స్ మయసభను సోని లివ్ లో చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చన్నమాట.