Advertisementt

కన్ఫ్యూజన్ ఎగరగొట్టేసిన అఖండ 2

Fri 08th Aug 2025 07:05 PM
balakrishna  కన్ఫ్యూజన్ ఎగరగొట్టేసిన అఖండ 2
Akhanda 2 Nears Completion కన్ఫ్యూజన్ ఎగరగొట్టేసిన అఖండ 2
Advertisement
Ads by CJ

సెప్టెంబర్ 25 బాక్సాఫీసు బరి హాట్ హాట్ గా మారబోతుంది.. అఖండ 2 vs OG. ఈ రెండు చిత్రాలు పోటీపడితే ఆ కిక్కే వేరప్పా అంటూ చాలామంది ఇంట్రెస్టింగ్ గా ఉంటే.. మధ్యలో OG మాత్రమే సెప్టెంబర్ 25 కి విడుదల అవుతుంది, అఖండ 2 వచ్చే ఛాన్స్ లేదు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయనే వార్తలు అఖండ 2 చుట్టూ తిరుగుతున్నాయి. 

చాలామంది అఖండ 2 సెప్టెంబర్ 25 కి రాదు, ఆ విషయంలో క్లారిటీ తీసుకున్నాకే OG సెప్టెంబర్ 25 టార్గెట్ గా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయని అన్నారు. కానీ అఖండ 2 మేకర్స్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మౌనంగా ఉండడం, OG ప్రమోషన్స్ స్టార్ట్ అయినా.. అఖండ 2 అప్ డేట్ లేకపోవడంతో సెప్టెంబర్ 25 నుంచి అఖండ తాండవం పోస్ట్ పోన్ తప్పదనే వార్త వైరల్ అవుతుంది. 

కానీ 2 సెప్టెంబర్ 25 నే వస్తుంది. అందులో ఎలాంటి కన్ఫ్యూజన్ కానీ మార్పు కానీ లేదు. అఖండ 2 సెప్టెంబర్ 25 థియేటర్లలో అడుగు పెట్టడాన్ని ఖాయమంటూ.. అఫీషియల్ గా మరోసారి కన్ఫర్మ్ చేసింది. అఖండ 2 వెనక్కి తగ్గేదేలే అంటూ.. డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య, బోయపాటిల ఫోటోని షేర్ చేసుకుని ఆ గుడ్ న్యూస్ చెప్పేసింది. 

మరి డబ్బింగ్ ఫినిష్ అయితే షూటింగ్ ఫినిష్ అయినట్లే. ఒకే ఒక్క పాట బ్యాలెన్స్ ఉన్నా అది ఎంతసేపు చిత్రీకరిస్తారు. సో అఖండ 2 విడుదల తేదీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. 

Akhanda 2 Nears Completion:

Balakrishna Done With Dubbing For Akhanda 2

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ