అవును విజయ్ దేవరకొండ కింగ్ డమ్ చిత్రానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళనాట కింగ్ డమ్ చిత్రానికి అనుకోని కష్టం వచ్చిపడింది. చిత్రంలోని కంటెంట్, పాత్రలు తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ నామ్ తమిజార్ కచ్చి సంస్థకు చెందిన కార్యకర్తలు కింగ్ డమ్ థియేటర్స్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
తమిళనాడులో కింగ్ డమ్ థియేటర్ల వద్ద నిరసనకు దిగడంతో పాటు సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లను, ఫ్లెక్సీలను చించివేయడం వంటి రచ్చ ఇప్పుడు కోర్టుకెక్కింది. సోషల్ మీడియాలో అయితే కింగ్ డమ్ బాయ్ కాట్ చేయాలని.. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సినిమాను తీయడానికి ఎవరు డబ్బు ఇచ్చారో చెప్పాలంటూ డిమాండ్స్ రేజ్ చేస్తున్నారు.
అయితే తమిళనాట కింగ్ డమ్ ను పంపిణి చేసిన సంస్థ ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద రక్షణ కల్పించాలంటూ మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారించిన అనంతరం కీలక ఆదేశాలు వెలువరించింది. కింగ్ డమ్ ప్రదర్శించే థియేటర్‌ల వద్ద భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది.
అంటే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ థియేటర్స్ దగ్గర ఎలాంటి రచ్చ జరగకుండా పోలీస్ ప్రొటక్షన్ ఉండబోతుందన్నమాట.