ఈరోజు మంగళవారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి తో టాలీవుడ్ నిర్మాతలు సమావేశమయ్యారు. చిరుని ఆయన ఇంటివద్ద కలిసిన వారిలో నిర్మాతలు సి. కళ్యాణ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవి శంకర్, సుప్రియ యార్లగడ్డ.. ఉన్నారు.
సినీ కార్మికుల ఆందోళన పై ప్రొడ్యూసర్స్ చిరు తో సమావేశమయ్యి సమస్యల పరిష్కారంపై మాట్లాడినట్టుగా తెలుస్తుంది. చిరు ఇంట్లో కొద్ధిసేపటి క్రితమే ప్రొడ్యూసర్స్ మీటింగ్ ముగిసింది. చిరు ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత నిర్మాత సి కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ..
మేము చిరంజీవి గారిని కలసి ప్రసుతం టాలీవుడ్ ఉన్న సమస్య గురించి చెప్పాము. షూటింగ్స్ సడెన్ గా ఆపడం భావ్యం కాదు, మీ సమస్యలు చెప్పారు అటు వైపు కార్మికుల వెర్షన్ ను కూడా తెలుసుకుంటాను అని చిరంజీవి గారు చెప్పారు.
రెండు మూడు రోజులు చూస్తాను, పరిస్థితి చక్కబడకపోతే నేను జోక్యం చేసుకుంటాను అని చిరంజీవి చెప్పినట్లుగా సి కళ్యాణ్ మీడియాకి చెప్పారు.