నందమూరి వారసుడిగా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఫామ్ చేసుకుని, స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో ఒంటరిపోరాటమే చేసారు కానీ ఎక్కడా నందమూరి వారసుడిగా చెప్పుకోలేదు. కళ్యాణ్ రామ్ తన వెంటే ఉంటున్నారు. బాలకృష్ణ తనని దూరం పెట్టినా ఏనాడూ పెల్లెత్తిమాట అనని ఎన్టీఆర్ వార్2 ప్రమోషన్స్ కోసం పర్సనల్ విషయాలు పంచుకున్నారు.
ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ పై ఎన్టీఆర్ ఫోటో వెయ్యడమే కాకుండా ఆ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో సినిమా వారసత్వంపై ఎన్టీఆర్ హాట్ కామెంట్ చేసారు. ఎస్క్వైర్ ఇండియా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కి సినిమా వారసత్వంపై ప్రశ్న ఎదురుకాగా.. తనకు తన కుటుంబానికి సంబంధించిన సినిమాల లెగసీ విషయంలో ఏం జరుగుతుందో తెలియదు.
అసలు తాను ఆ విషయంలో ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని, కానీ తాను చేసే కథలతో తనను అందరూ గుర్తుంచుకోవాలనే ప్రయత్నం మాత్రం చేస్తున్నానని అన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా తనను ఒక యాక్టర్ గా కన్నా ఎక్కువగా ఒక నిజాయితీగల మనిషిగా గుర్తించాలని, ఎమోషన్ తో కూడిన నిజాయితీ గల వ్యక్తిగా గుర్తించాలని తాను కోరుకుంటున్నట్లుగా ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.