Advertisementt

తమిళనాట కింగ్ డమ్ పోస్టర్ల చించివేత

Tue 05th Aug 2025 05:22 PM
kingdom  తమిళనాట కింగ్ డమ్ పోస్టర్ల చించివేత
NTK Activists Rage Against Vijay Kingdom తమిళనాట కింగ్ డమ్ పోస్టర్ల చించివేత
Advertisement
Ads by CJ

గత గురువారం థియేటర్స్ లో విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ చిత్రానికి తెలుగులో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికి.. కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు నష్టాలైతే తీసుకురావడం లేదు. అయితే పాన్ ఇండియా మూవీగా విడుదలైన కింగ్ డమ్ చిత్రం కేవలం తమిళనాట, అలాగే కేరళలో కాస్త పవర్ చూపించింది. 

హిందీలో కింగ్ డమ్ సౌండ్ వినిపించలేదు. తమిళనాట కాస్త పర్వాలేదనిపించిన కింగ్ డమ్ చిత్రానికి ఇప్పుడొక సమస్య ఎదురైంది. కింగ్ డమ్ ప్రదర్శిస్తున్న థియేటర్స్ వద్ద కింగ్ డమ్ పోస్టర్స్ చించి వేసి నిరసనకారులు ఆందోళన చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కింగ్ డమ్ సినిమాలోని తమిళ ఈలం గ్రూపును తప్పుడు రీతిలో చూపించారు. 

కింగ్ డమ్ లో చూపించిన పాత్రలు, కంటెంట్‌ వల్ల తమిళుల మనోభావాలు దెబ్బ తీశారు అంటూ నామ్ తమిజార్ కచ్చి సంస్థకు చెందిన కార్యకర్తలు కింగ్ డమ్ థియేటర్స్ ముందు ఆందోళనకు దిగారు. థియేటర్ల వద్ద తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని డిమాండ్‌ చేయడం వివాదంగా మారింది.

NTK Activists Rage Against Vijay Kingdom:

Protests erupt over Kingdom film as Seeman demands ban for insulting Eelam Tamils

Tags:   KINGDOM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ