రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. వరస షెడ్యూల్స్ తో పెద్ది షూటింగ్ ని బుచ్చిబాబు చకచకా పూర్తి చేస్తున్నారు. ఈమధ్యన వర్షాల కారణంగా పెద్ది షూటింగ్ కి చిన్నపాటి బ్రేకిచ్చారు బుచ్చిబాబు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. పెద్ది ఫస్ట్ షాట్ ఎంతగా ట్రెండ్ అయ్యిందో చరణ్ లుక్ అంతే వైరల్ అయ్యింది.
అయితే తాజాగా పెద్ది చిత్రంలో ఓ క్రేజీ ఐటెం సాంగ్ ని బుచ్చిబాబు ప్లాన్ చేసారని, ఆ సాంగ్ కోసం చాలామంది టాప్ హీరోయిన్స్ ని అనుకున్న పుష్ప 2 కిస్సిక్ సాంగ్ తో బాగా పాపులర్ అయిన శ్రీలీల ను రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో నటింపజేసేందుకు చర్చలు జరుపుతున్నారట. ఈమధ్యనే జూనియర్ చిత్రంలో వైరల్ వయ్యారితో శ్రీలీల స్క్రీన్స్ ని ఊపేసింది.
అయితే ప్రస్తుతం శ్రీలీల పేరు పరిశీలనలో ఉంది అని, ఆమె చివరిగా ఫైనల్ అవుతుందో లేదో అనేది అనుమానమే. ప్రస్తుతం పెద్ది ఐటెం సాంగ్ లో శ్రీలీల పేరు మాత్రం బాగా వినబడుతుంది.