Advertisementt

జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ స్ట్రీమింగ్ డేట్

Tue 05th Aug 2025 03:14 PM
zee5  జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ స్ట్రీమింగ్ డేట్
Janaki V v/s State of Kerala Streaming date fix జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ స్ట్రీమింగ్ డేట్
Advertisement
Ads by CJ

విమర్శకుల ప్రశంసలు పొందిన రీసెంట్ మాలీవుడ్ లీగల్ డ్రామా J.S.K - జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనే ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను కట్ చేశారు.

Janaki V v/s State of Kerala Streaming date fix :

Janaki V v/s State of Kerala Streams August 15 Only On ZEE5

Tags:   ZEE5
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ