కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ హీరో అయినప్పటికి.. పర్సనల్ లైఫ్ లో ఆయన తరచూ ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటున్నారు. ధనుష్ తమ కొడుకే అని ఓ జంట కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో 18 ఏళ్ళ వివాహ బంధానికి ధనుష్ విడాకులు తీసుకుని ముగింపు పలికారు.
అంతేకాదు ధనుష్ చాలా రొమాంటిక్ అని, ఆయన చాలామంది హీరోయిన్స్(అమల పాల్, శృతి హాసన్ వగైరా వగైరా) తో ఎఫైర్లు నడిపాడనే ప్రచారము ఉంది. ప్రస్తుతం సింగిల్‌గా ఉన్న ధనుష్ మాజీ హీరోయిన్ మీనాని పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. మీనా ఈవార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు.
ఇప్పుడు ధనుష్ మరో హీరోయిన్ ప్రేమలో ఉన్నాడనే వార్త వైరల్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తో ధనుష్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని.. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తీరుతుంది, రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ బర్త్ డే పార్టీలో ధనుష్ స్పెషల్ గా కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది.
బర్త్ డే పార్టీలో మృణాల్-ధనుష్ ఇద్దరూ సన్నిహితంగా మెలగడం, చేతులు పట్టుకోవడం, ఇద్దరూ లవర్స్‌లా కనిపించడంతో వారు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.