Advertisementt

తొలి తెలుగు సినిమాకి రిషబ్ శెట్టి పారితోషికం

Sun 03rd Aug 2025 01:12 PM
rishab shetty  తొలి తెలుగు సినిమాకి రిషబ్ శెట్టి పారితోషికం
Rishab Shetty remuneratio తొలి తెలుగు సినిమాకి రిషబ్ శెట్టి పారితోషికం
Advertisement
Ads by CJ

కన్నడ కాంతార తో ఒక్కసారిగా ఇతర లాంగ్వేజెస్ లో పాపులర్ అయిన నటుడు రిషబ్ శెట్టి. కాంతార కు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2 న విడుదలకు సిద్దమవుతుంది. ఈలోపు రిషబ్ శెట్టి తెలుగులో సినిమాలు చెయ్యడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చిత్రాన్ని ఓకె చేసారు. 

ఆ సినిమా అసలు ఉంటుందో, ఉండదో అనే డైలమాలో రిషబ్ శెట్టి నుంచి మరో తెలుగు సినిమా అనౌన్సమెంట్ వచ్చేసింది. సితార ఎంటర్టైన్మెంట్ లో రిషబ్ శెట్టి తెలుగు మూవీ అనౌన్సమెంట్ వచ్చింది. ఈ చిత్రాన్ని అశ్విన్ గంగరాజు తెలుగు, కన్నడ లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రానికి రిషబ్ శెట్టి రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది. 

కాంతార కి చాలా తక్కువ పారితోషికం తీసుకున్న రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ కోసం 12 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు రిషబ్ శెట్టి సితార లో చెయ్యబోయే తెలుగు సినిమా కోసం ఏకంగా 55 కోట్లు కళ్ళు చెదిరే పారితోషికం అందుకోబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అందుకే రిషబ్ శెట్టి తెలుగు సినిమాలను ఓకె చేస్తున్నారు, తెలుగు లో భారీ పారితోషికాలు ఉంటాయని అందుకే ఇలా అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.  

Rishab Shetty remuneratio:

Rishab Shetty Bags Fancy Paycheck for Tollywood Film

Tags:   RISHAB SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ