దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ప్రియురాలు దివ్వెల మధురితో డివోషనల్ ట్రిప్స్, హ్యాపీ ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యనే అరుణాచలం గిరి ప్రదక్షణం చెయ్యడం, ఆ తర్వాత కూర్గ్, ఊటీ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. రీల్స్, వకుళ సిల్క్స్ ప్రమోషన్స్ లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇద్దరూ మాములుగా రచ్చ చెయ్యడం లేదు.
అయితే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు అయ్యింది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్‌లో దువ్వాడపై కేసు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నెలకు రూ.50 కోట్ల చొప్పున సూటుకేసులు అందుకుని ప్రశ్నించడం లేదని విమర్శలు చేశారు.
దానితో జనసేన నాయకుడు పంజరాపు సింహాచలం దువ్వాడ శ్రీనివాస్ పై పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన హిరమండలం పోలీసులు నిన్న ఎమ్మెల్సీ దువ్వాడకు టెక్కలి సమీపంలోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు.