ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన ఫ్రెండ్, ప్రేమికుడు మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ను అంగరంగ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈ జంట పలు చోట్ల కలిసి సరదాగా కనిపించారు. ఏడేళ్ల క్రితం 2018 లో వివాహం చేసుకున్న ఈ జంట విడిపోయి విడాకులు తీసుకుంటున్నట్టుగా సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం అభిమానులను బాధపెట్టింది.
విడాకులు తీసుకుంటున్నామని చెప్పిన సైనా నెహ్వాల్ కశ్యప్ తో కలిసి ఉండలేను కానీ.. స్నేహం చేస్తా అంటూ ప్రకటించింది.
పారుపల్లి కశ్యప్ మాత్రం సైనా తో విడిపోతున్న విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడమే షాకింగ్ అనుకుంటున్న సమయంలో వారిద్దరూ కలిసి కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. కలిసి కనిపించడమే కాదు తామిద్దరూ కలిసిపోయినట్టుగా సైనా నెహ్వాల్ ప్రకటించడం నిజంగా షాకించ్చింది.
భర్త కశ్యప్‌తో కలిసి వెకేషన్లో ఉన్న సైనా నెహ్వాల్ ఆ ఫొటోను షేర్ చేస్తూ, కొన్నిసార్లు దూరం ఒకరి ఉనికి తాలూకు విలువను తెలియజేస్తుందని.. తామిద్దరం ఇంకోసారి ప్రయత్నించి చూడాలని అనుకున్నామని చెప్పి నిజంగానే షాకిచ్చింది.
మరి ఇలా విడిపోతున్న జంటలు కలవాలని వాళ్ళ అభిమానులు ఎంతగా కోరుకుంటున్నా కొంతమంది విడాకులు తీసేసుకుంటున్నారు. ఇలా మరోసారి అర్ధం చేసుకుని కలవాలనే థాట్స్ రావడం మాత్రం గ్రేట్.. ఈ విషయంలో సైనా నెహ్వాల్-కస్యప్ మధ్యన ఏమి జరిగినా మళ్ళీ కలవాలనే వారి నిర్ణయాన్ని అభినందించాల్సిందే.