సంచలనాల `మిషన్ ఇంపాజిబుల్` ఫ్రాంఛైజీలో చిట్టచివరి చిత్రంలో నటించిన టామ్ క్రూజ్ ప్రస్తుతం కామెరూన్ తో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 63 వయసు వచ్చినా ఇప్పటికీ 20 ప్లస్ కుర్రాడిలా ఎంతో హుషారుగా యాక్షన్ అడ్వెంచర్లతో రెచ్చిపోతున్న టామ్ క్రూజ్, మునుముందు మరిన్ని సంచలనాలకు తెర తీయడం ఖాయమనే కథనాలొస్తున్నాయి.
ఇలాంటి సమయంలో అతడు తనకంటే చాలా చిన్న వయసు (37 ఏజ్) ఉన్న క్రేజీ హీరోయిన్ తో డేటింగ్ చేస్తుండడం గుసగుసలకు తావిస్తోంది. ఈ బ్యూటీ పేరు అనా డి అర్మాస్. ఇద్దరి మధ్యా 26 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. అయినా అతడు ఈ బ్యూటీతో చెట్టాపట్టాల్ అంటూ బహిరంగంగా షికార్లు చేస్తున్నాడు. దీనిపై హాలీవుడ్ మీడియాలు నిరంతరం కథనాలు అల్లడంలో బిజీగా ఉన్నాయి. మూడు సార్లు వైవాహిక జీవితంలో ఫెయిలైన టామ్ జెన్ జెడ్ బ్యూటీతో షికార్లు చేస్తున్నాడంటూ ఒకటే కథనాలు వండి వారుస్తున్నాయి హాలీవుడ్ పోర్టల్స్.
ఇక అనా డి అర్మాస్ డేటింగ్ హిస్టరీ తక్కువేమీ కాదు. ఈ స్పానిష్ బ్యూటీ అప్పటికే నటుడు మార్క్ క్లోటెట్ ను వివాహం చేసుకుని అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాతా చాలామందితో డేట్ చేసింది. `డీప్ వాటర్` సహనటుడు బెన్ అఫ్లెక్ తో లాంగ్ రిలేషన్ కారణంగా చర్చల్లో నిలిచింది. చివరాఖరుకు ఇప్పుడు టామ్ తో సెటిలైంది.