కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా అని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తున్న ఒకే ఒక వ్యక్తి కొడాలి నాని. కొడాలి నాని అరెస్ట్ కోసం ఎదురు చూడని టీడీపీ కార్యకర్త లేరు అంటే నమ్మాలి. అంతగా కొడాలిపై ఆగ్రహంగా ఉన్నారు వారు. కొడాలి నాని ని ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై లోకేష్ పైన ఒత్తిడి తీసుకొస్తూ టీడీపీ కార్యకర్తలు కినుకు వహిస్తున్నారు.
అయితే కొడాలి నానిపై పలు కేసులు నమోదు అయినా ముందస్తు బెయిల్ తెచ్చుకొవడమో లేదంటే అనారోగ్య కారణాలతో పోస్ట్ పోన్ చెయ్యడమో జరుగుతుంది. నాని అరెస్ట్ అన్న వార్తల నేపథ్యంలో కొడాలి నాని అనూహ్యంగా ఆసుపత్రిలో చేరి సీరియస్ కండిషన్ లో ముంబై లో హర్ట్ సర్జరీ చేయించుకోవడం, ఆతర్వాత ఆయన హైదరాబాద్ లో రెస్ట్ లో ఉండడం అన్నీ అలా అలా కలిసొచ్చాయి. అయితే నాని అనారోగ్యం నేపథ్యంలో అరెస్ట్ చేస్తే అతనికి బెయిల్ ఈజీగా వస్తుంది అని.. అందుకే కూటమి ప్రభుత్వం నాని అరెస్ట్ ను ఆపింది అనే వార్తలను బ్లూ మీడియా రాసింది.
తాజాగా కొడాలి నాని పై మరో కేసు నమోదు అయ్యింది. కొడాలి నానిపై ఐటీ యాక్టు నమోదు చేసారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై ఫిర్యాదు రావడంతో.. 2024లో విశాఖ వాసి అంజనాప్రియ విశాఖ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
దానితో కొడాలి నానిపై U/S353(2), 352, 351(4), 196(1) BNS 467, IT యాక్టు నమోదు చేసారు. గుడివాడలో కొడాలి నానికి విశాఖ త్రీటౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.