ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక మందన్ననే. హిందీ హీరోయిన్స్ తో పోటీ పడి బాలీవుడ్ లో గెలిచిన రష్మిక ప్రస్తుతం హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ లో నటిస్తుంది. రీసెంట్ గానే మైస మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసింది.
మరోపక్క గర్ల్ ఫ్రెండ్ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తుంది. ఇక రూమర్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ విడుదల సందర్భంగా రష్మిక సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. విజయ్ మనం కొట్టినం అంటూ వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. విజయ్ దేవరకొండ-రష్మిక డేటింగ్ లో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఈ ట్వీట్ లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే రష్మిక మందన్న తరచూ తన గ్లామర్ ఫొటోస్ ను వదులుతుంది. తాజాగా రష్మిక వదిలిన పిక్ మాత్రం క్యూట్ గా ఉండడమే కాదు.. ముద్దొస్తుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. రష్మిక సోషల్ మీడియా పిక్ పై మీరు ఓ లుక్కెయ్యండి.