హరిహర వీరమల్లు చిత్రాన్ని మొదలు పెట్టిన దర్శకుడు క్రిష్ ఆ ప్రోజెక్టు నుంచి తప్పుకుని తన పని తను చూసుకున్నప్పటికి హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో క్రిష్ పార్టిసిపేట్ చేస్తారని అనుకున్నారు. కానీ క్రిష్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా హరి హర వీరమల్లు రిలీజ్ కు ముందు ఓ ట్వీట్ వేసి చేతులు దులుపుకున్నారు.
అసలు క్రిష్ వీరమల్లు విషయంలో మీడియా ముందుకు రావడం కానీ, సినిమాపై ట్వీట్లు వెయ్యడం కానీ చెయ్యలేదు. మరి వీరమల్లు రిలీజ్ ముందు ప్రమోషన్స్ లో మీడియా నుంచి తప్పించుకున్న క్రిష్ ఘాటీ రిలీజ్ సమయంలో ఖచ్చితంగా మీడియా ముందుకు రావాలి, ఘాటీ రిలీజ్ తేదీ ఇచ్చాక ప్రమోషన్స్ ఇవ్వాలి.
ఘాటీ ప్రమోషన్స్ లో క్రిష్ కి హరి హర వీరమల్లు ప్రశ్నలైతే తప్పవు, ఆయన కూడా వీరమల్లు ప్రశ్నలను అవాయిడ్ చెయ్యాలనుకున్నా మీడియా మిత్రులు వదలరు. వారు పాపులర్ అయ్యేందుకు ప్రశ్నలు అడక్క మానరు. మరి క్రిష్ ఇక్కడ తప్పించుకున్నా అక్కడ ఘాటీ లో దొరకాల్సిందే.