కొన్నేళ్లుగా విజయం కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ కు కింగ్ డమ్ తో బిగ్ రిలీఫ్ దక్కినట్టే. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ నిన్న గురువారం పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కింగ్ డమ్ విడుదలకు ముందే ఓపెనింగ్ పరంగా స్ట్రాంగ్ గా కనిపించింది.
కింగ్ డమ్ కి భారీగా ఓపెనింగ్స్ దక్కాయి. ఓవర్సీస్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వరకు థియేటర్స్ ఫుల్ అయ్యాయి. కింగ్ డమ్ కు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. ఆడియన్స్ మాత్రం సూపర్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. అంతేకాకుండా సూరి పాత్రలో విజయ్ దేవరకొండ నటనను ఆయన అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం మెచ్చుకుంటున్నారు.
శివగా సత్య దేవ్ విజయ్ దేవరకొండ తో పోటీపడి నటించడం, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని కింగ్ డమ్ కి బిగ్ ప్లస్ అయ్యాయి. ఈ వీకండ్ లో కింగ్ డమ్ బాక్సాఫీసు దగ్గర జోరు చూయించడం ఖాయం. ఇది విజయ్ కు చాన్నాళ్లకు దక్కిన విజయం.
సోషల్ మీడియాలో కింగ్ డమ్ రెస్పాన్స్ చూసాక విజయ్ దేవరకొండ కూడా రిలాక్స్ అవుతున్నాడు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ విజయ్ ను డిజప్పాయింట్ చేసిన కింగ్ డమ్ రిజల్ట్ విజయ్ దేవరకొండకు బిగ్ రిలీఫ్ నిచ్చింది అనడంలో సందేహం లేదు.