సిద్దార్థ్ లేటెస్ట్ చిత్రం 3 బి హెచ్ కె. ఈ చిత్రం తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. తమిళనాట విజయ సాధించిన ఈ సినిమాకు తెలుగులో హిట్ టాక్ వచ్చినా థియేటర్స్ లో అంతగా పెరఫార్మ్ చెయ్యలేకపోయింది. గత నెల అంటే జులై 4 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కిన 3 బి హెచ్ కె ను ఫ్యాన్సీ డీల్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. నేటి నుంచి అంటే ఆగష్టు 1 నుంచి 3 బి హెచ్ కె ను అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.
మరి థియేటర్స్ లో మిస్ అయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వీక్షించేయ్యండి.