గత గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరి హర వీరమల్లు చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో అందరూ చూసారు. వీరమల్లు గ్రాఫిక్స్ పై సోషల్ మీడియాలో సినిమా పరిచయం లేని వ్యక్తులు కూడా కామెంట్స్ చేసేలా హరి హర వీరమల్లు విఎఫెక్స్ వర్క్ ఉంది.
జులై 24 న విడుదలైన వీరమల్లు మొదటి వీకెండ్ లో పర్వాలేదనిపించింది.. సోమవారం నుంచి విషమ పరీక్షను ఎదుర్కొంది. ఈరోజుకి వీరమల్లు విడుదలై వారం పూర్తయ్యింది. ఇంతలోనే హరి హర వీరమల్లు ఓటీటీ రిలీజ్ పై సోషల్ మీడియాలో కనిపిస్తున్న న్యూస్ లు చూస్తే పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు.
హరి హర వీరమల్లు అనుకున్న దానికన్నా ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది అనే వార్త వైరల్ అయ్యింది. హరి హర వీరమల్లును అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. వీరమల్లు థియేట్రికల్ రిలీజ్ కోసం అమెజాన్ చాలా ఎదురు చూసింది. ఇప్పుడు థియేటర్స్ లో డిజప్పాయింట్ అయిన హరి హర వీరమల్లును ప్రైమ్ వీడియో ఎర్లీ ఓటీటీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.