గత వారం విడుదలైన హరి హర వీరమల్లు ప్లాప్ ను మరిపించేందుకు OG మేకర్స్ గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. హరి హర వీరమల్లు పై భారీ హైప్ లేకపోయినా.. విఎఫెక్స్ విషయంలో సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫీడ్ బ్యాక్ చూసాక పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు.
రెండేళ్ల తర్వాత పవన్ ను ఇలా స్క్రీన్ పై చూసి నిరాశపడిపోయిన అభిమానులకు OG మేకర్స్ ఆ నిరాశను దూరం చేసే సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు. రేపు ఆగష్టు 2 న OG నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టుగా అప్ డేట్ ఇవ్వడమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాల్ హిమ్ OG అంటూ హైపెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 25 న రాబోయే OG ప్రమోషన్స్ ను మేకర్స్ అప్పుడే స్టార్ట్ చేసేసారు.
మరోపక్క హరి హర వీరమల్లు బాధను మరిపించేలా OG అప్ డేట్స్ ఉండబోతున్నాయి, ఇకపై వీరమల్లు విషయం పక్కనపడేసి OG గురించి ఆలోచించమని అభిమానులకు పవన్ చెప్పినట్టే ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.