పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ షూటింగ్ స్టేటస్ ఏమిటి. రీసెంట్ గా పూరి జగన్నాధ్ ప్రభాస్ కోసం రాజా సాబ్ సెట్ కి వెళ్లారు. అంటే ఇంకా రాజా సాబ్ షూటింగ్ పూర్తి కాలేదు. మరి డిసెంబర్ 5న రాజా సాబ్ రిలీజ్ అంటూ ఈమధ్యనే టీజర్ తో పాటుగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. ఆతర్వాత రాజా సాబ్ మరోసారి పోస్ట్ పాన్ అవ్వొచ్చనే న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.
ఇప్పుడేమో 2026 సంక్రాంతి సీజన్ లో ప్రభాస్ రాజా సాబ్ ని దించే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్. మరి రాజా సాబ్ డిసెంబర్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతి వార్ కి సిద్ధమవుతుందా, పదే పదే సినిమా పోస్ట్ పోన్ అయితే గనక క్రేజ్ పోతుందేమో అనే ఆందోళనలోకి ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్లిపోతున్నారు.
రాజా సాబ్ డిజిటల్ హక్కులు తీసుకున్న ఓటీటీ సంస్థ నిర్ణయం ప్రకారమే సంక్రాంతికి రాజా సాబ్ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారో, లేదంటే మరేదన్నా కారణాలున్నాయో అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.