ఈరోజు గురువారం క్వారీ కేసులో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి ని కలిసేందుకు బెంగుళూర్ ప్యాలెస్ నుంచి స్పెషల్ గా నెల్లూరుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాకాణి ని పరామర్శించి ఆ తర్వాత టీడీపీ ఎమ్యెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని అనుచిత వ్యాఖ్యలతో బాధపెట్టిన నల్లపరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జగన్ అనంతరం కూటమి ప్రభుత్వం పై ఇష్టం వచ్చిన రీతిలో రెచ్చిపోయారు. మాజీ సీఎం ని చూసి చంద్రబాబు భయపడుతున్నారు, అందుకే 2 వేలమంది పోలీసులను పెట్టారు, మీ కార్యకర్తలు అప్పట్లో నల్లపరెడ్డి ఇంట్లో ఉంటే చంపేసేవారే, నగరి ఎమ్యెల్యే.. మా రోజాను తిడుతుంటే చర్యలు తీసుకోలేదు. కాకాణి ని అక్రమంగా జైలులో పెట్టారు.
మా నేతలకు ఒక కేసులో బెయిల్ వస్తుంటే మరికొన్ని కేసులు పెడుతున్నారు, మేము అధికారంలోకి వస్తాము, అప్పుడు చూపిస్తాము మా రివెంజ్ అంటూ రాక్షస రాజకీయాలు మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డికి ఏపీ విద్య, ఐటి శాఖా మినిస్టర్ నారా లోకేష్ మీడియా సమావేశంలో కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రికి కూడా ఇవ్వని సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చాం, బందోబస్త్ కు పోలీసులను పంపిస్తే అంతమంది అవసరమా అంటారు, లేదంటే పోలీసులను బందోబస్త్ కు ఇవ్వలేదు అంటారు. పోలీసులపై మీ వైసీపీ కార్యకర్తలు దాడి చేసారు. జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు పర్యటనకు వచ్చినా ఇదే మాదిరి రచ్చ చేసి వెళుతున్నారంటూ లోకేష్ జగన్ పై విరుచుకుపడ్డారు.
ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన పక్కా ఆధారాలతోనే లిక్కర్ స్కాం దర్యాప్తు జరుగుతోందని, లిక్కర్ సరఫరా చేసిన ఓ డిస్టిలరీ కంపెనీలు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసిందని లోకేష్ తెలిపారు. అంతేకాకుండా లిక్కర్ స్కామ్‌లో సొమ్ము పెద్దిరెడ్డి ఖాతాలకు చేరిందనని, కాదని పాపాల పెద్దిరెడ్డి చెప్పాలని లోకేష్ సవాల్ చేశారు.